: రూ.5 కోట్లు ఎగవేసిన సినీ నటి రాధిక ‘రాడాన్’ సంస్థ.. ఐటీ విచారణలో వెల్లడి


ప్రముఖ నటి రాధికకు చెందిన రాడాన్ సంస్థ  రూ. 4.97 కోట్ల మేరకు పన్ను ఎగవేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మంగళవారం ‘రాడాన్’ కార్యాలయాల్లో తనిఖీ చేసిన ఆదాయపన్ను అధికారుల విచారణలో ఈ విషయం వెల్లడైంది. ఆర్కేనగర్ ఉప ఎన్నిక సందర్భంగా అన్నాడీఎంకే నాయకుల నుంచి భారీగా ముడుపులు అందుకుని ఆ పార్టీ అభ్యర్థి దినకరన్‌కు శరత్ కుమార్ మద్దతు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు శరత్ కుమార్ నివాసంతోపాటు ఆయన సతీమణి నటి రాధికకు చెందిన రాడాన్ సంస్థ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. బుధవారం శరత్ కుమార్, రాధిక ఐటీ విచారణకు కూడా హాజరయ్యారు. రాడాన్ సంస్థ రూ.4.97  కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను ఎగవేసినట్టు విచారణలో తేలింది. అయితే ఈ మొత్తం సొమ్మును చెల్లించేందుకు వారిద్దరూ అంగీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News