: కత్తితో బెదిరించి డ్రైవర్ పై యువతి అత్యాచారం!


పోలీసులనే అవాక్కయ్యేలా చేసిన ఈ ఘటన అమెరికాలోని ఓహియోలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, 23 ఏళ్ల వయసున్న బ్రిటనీ కార్టర్ అనే యువతి తనకు పరిచయం ఉన్న కోరీ జాక్సన్ అనే యువకుడితో కలసి ఓ ట్యాక్సీ ఎక్కింది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత 29 ఏళ్ల వయసున్న ట్యాక్సీ డ్రైవర్ పై వీరిద్దరూ దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా, డ్రైవర్ గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. అనంతరం, ట్యాక్సీ డ్రైవర్ పై బ్రిటనీ కార్టర్ అత్యాచారం జరిపింది. అంతేకాదు, అతని వద్ద ఉన్న డబ్బును కూడా లాక్కున్నారు. దొంగతనం అనంతరం మరోసారి అతనిపై అత్యాచారం చేసింది సదరు యువతి.

ఇప్పటికే ఈమెపై పలు కేసులు ఉన్నాయి. గత ఏడాది ఈమెపై హెరాయిన్ అక్రమ రవాణాకు సంబంధించిన కేసు నమోదయింది. అంతేకాదు, ఓ హత్య కేసులో కూడా ఈమె నిందితురాలిగా ఉంది. అత్యాచారం కేసులో బెయిలు కోసం రూ. 38 లక్షల వ్యక్తిగత పూచీకత్తును చెల్లించాలంటూ బ్రిటనీ కార్టర్ ను కోర్టు ఆదేశించింది. ఆమె స్నేహితుడిపై అత్యాచారానికి సహకరించడం, దొంగతనం కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News