: ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఇవ్వద్దని ప్రణాళిక సంఘం చెప్పలేదని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏపీ ఇబ్బందులు ఎదుర్కుంటుందని అన్నారు. అనంతరం సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ... ఏపీలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని అన్నారు. ఏపీ హైదరాబాద్‌ను కోల్పోయి బాగా నష్టపోయిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీలు ఉద్ఘాటించారు.