: ప్రభుత్వ జోక్యం అవసరం లేదు.. ట్రిపుల్‌ తలాక్‌ను మేమే రద్దు చేస్తాం: ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు


మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేసే పద్ధతిపై ఎంతో మంది బాధిత ముస్లిం మ‌హిళ‌లు కోర్టు మెట్లు ఎక్కిన విష‌యం తెలిసిందే. అయితే, ట్రిపుల్ త‌లాక్‌ను తొలగించే అంశంపై ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పందిస్తూ... ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని పేర్కొంది. తామే ఏడాదిన్నరలోగా ఈ విధానాన్ని రద్దు చేస్తామని లా బోర్డు ఉపాధ్యక్షుడు డా. సయీద్‌ సాధిఖ్ చెప్పారు. ఇటీవ‌లే లాబోర్డు ఈ అంశంపై స్పందిస్తూ ట్రిపుల్‌ తలాక్ రద్దుకు చాలా తక్కువ మంది మహిళలే మద్దతిస్తున్నారని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. లాబోర్డు అటువంటి ప్రకటన చేసిన‌ రెండు రోజులకే సాధిఖ్ మ‌ళ్లీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News