: భద్రాద్రిలో తలంబ్రాలను కేసీఆర్ మనువడు అందజేయడం దారుణం: భట్టి విక్రమార్క


శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి తలంబ్రాలను కేసీఆర్ మనువడు అందజేయడం దారుణమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్టు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, ఆ హామీని మరిచారని అన్నారు.

కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ‘మిషన్ భగీరథ’పై విజిలెన్స్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పైనా భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఓ పిల్లకాకి అని, విమర్శలు చేసేటప్పుడు ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని, ఈ విషయమై చర్చకు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News