: 35 లక్షలకు అమ్ముడు పోయిన ఐన్ స్టీన్ లేఖ


ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌ స్టీన్‌ రాసిన రెండు పేజీల లేఖ 35 లక్షల రూపాయల ధర పలికి వేలం నిర్వాహకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.... 1953 లో అర్థర్‌ కన్వెర్స్‌ అనే సైన్స్‌ టీచర్‌ సబ్జెక్టులో వచ్చిన సందేహాలను ఐన్ స్టీన్ కు లేఖ రాసి అడిగి తెలుసుకునే వారు. ఐన్ స్టీన్ కూడా ఆయనకు ఓపిగ్గా సమాధానాలు రాసేవారు. ఇలా ఆయన చాలా లేఖలు రాశారు. ఆయనకు ఐన్ స్టీన్ కూడా పలు సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలో ఎలక్ట్రోస్టాటిక్ థియరీకి సంబంధించిన ప్రశ్నను అర్ధర్ కన్వెర్స్ సంధించగా, ఆయనకు అర్థమయ్యేలా వివరిస్తూ ఐన్ స్టీన్ తిరిగి లేఖ రాశారు. ఆ లేఖపై ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్డ్‌ స్టడీ ఉయ ప్రిన్స్‌ టన్, రూమ్‌ నంబర్‌ 115, న్యూ జెర్సీ’ అనే చిరునామా ఉంది. రెండు పేజీల ఈ లేఖను తీసుకొచ్చిన వ్యక్తి వేలం వేయాలంటూ నేట్ డీ శాండర్స్ కు అందించారు. ఆ లేఖకు 15,000 డాలర్లు వస్తే చాలని అంచనా వేయగా, ఊహించని విధంగా అది 53,503 డాలర్ల (భారత కరెన్సీలో 35 లక్షల రూపాయల) కు అమ్ముడుపోయింది. 

  • Loading...

More Telugu News