: అతడిని చూసి అందరూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథే అనుకున్నారు.. మర్యాదలు చేశారు!


అచ్చం ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లా వేషం వేసుకొని వచ్చిన ఓ వ్యక్తిని చూసిన ప్రజలు ఆయ‌న‌పై పూలు చ‌ల్లారు. ఆయ‌న‌ను చూసిన యూపీ పోలీసులు సైతం ఆయ‌నే నిజ‌మైన సీఎం అనుకొని బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. యోగి ఆదిత్యనాథ్‌లా కాషాయ రంగు దుస్తులు ధరించి కారులో వచ్చాడు ఓ వ్యక్తి. అంతేకాదు, ఆయ‌న ప‌క్క గన్‌మెన్‌ కూడా ఉన్నాడు. దీంతో అంతా భ్ర‌మ‌ప‌డిపోయారు. చివ‌రికి ఎలాగో ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు.. అత‌డి వెంట వ‌చ్చిన‌ గన్‌మెన్లు కూడా న‌కిలీ వారేన‌ని తెలుసుకొని ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే, ఇలా ఓ సామాన్య వ్యక్తి సీఎంని అనుకరించడం నిబంధనలు అతిక్రమించిడమేన‌ని కొంద‌రు మండిప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News