: చిరుతపులి కారణంగా కాసేపు మూతపడిన విమానాశ్రయం
నేపాల్ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేకు సమీపంలో చిరుతపులి కనిపించడంతో ఆ ఎయిర్‌పోర్టు కాసేపు మూతపడింది. చిరుతపులి కనిపించిందని బుద్ధ ఎయిర్ సంస్థకు చెందిన పైలట్ సమాచారం అందించడంతో దాన్ని పట్టుకునేందుకు జంతుపరిరక్షణ అధికారులు రంగంలోకి దిగారు. ఎయిర్‌పోర్టును అర్ధగంట పాటు మూసివేశామని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు. చిరుత కారణంగా విమానాల రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగలేదని, ఒక అంతర్జాతీయ విమానం మాత్రమే ఆలస్యమైందని చెప్పారు.