: ఎవరూ రాజీనామాలు చేయక్కర్లేదు... చేసిన వారికి చెప్పిచూస్తాం: చంద్రబాబు
మంత్రి పదవులు దక్కలేదని ఎవరూ రాజీనామాలు చేయక్కర్లేదని, ఎవరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తనకు తెలుసునని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాజీనామాలు చేస్తామని అంటున్న బెదరింపులకు తాను భయపడేది లేదని, ఇదే సమయంలో మనస్తాపంతో ఉన్న వారికి నచ్చజెపుతామని అన్నారు. ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ లో పలువురు ఎమ్మెల్యేలు తమ జిల్లాలకు అన్యాయం జరిగిందని, తమ వర్గాలకు పదవులు దక్కలేదని ఫిర్యాదులు చేయగా, అన్ని విషయాలూ తనకు తెలుసునని, ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో చేస్తానని అన్నారు. ఎవ్వరూ కూడా బహిరంగంగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్దని, కట్టుతప్పితే మాత్రం చర్యలుంటాయని హెచ్చరించారు.