: నిర్మాతల మండలి ఎన్నికల్లో హీరో విశాల్ విజయకేతనం


గతంలో జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికల్లో గెలిచిన హీరో విశాల్, ఇప్పుడు 2017-19 సంవత్సరాలకుగాను తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఆయన నాయకత్వంలో ప్రకాష్‌రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్‌ ప్రభు (కోశాధికారి) కూడా గెలిచారు. తమిళ నిర్మాతల మండలిలో మొత్తం 1,212 మంది సభ్యులుండగా, 1059 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అధ్యక్ష పదవికి పోటీచేసిన వారిలో విశాల్‌ కు 478, రాధాకృష్ణన్ కు 355, కేఆర్‌ కు 224 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండు నుంచే విశాల్‌ ముందంజలో నిలవడం గమనార్హం. విజయానంతరం విశాల్ మాట్లాడుతూ, తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతలు మార్పును కోరుకున్నారని, వారి మనోభావాలే తన గెలుపుగా మారాయని, ఇక తమ జట్టు అంకితభావంతో పనిచేసి, నిర్మాతల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. తమిళ సినిమాకు మరోసారి స్వర్ణయుగం తీసుకు రావడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News