: సుశీల్ కుమార్ డబ్ల్యూడబ్ల్యూఈలో చేరడం లేదు: కన్యన్ సీమన్
రెండు ఒలింపిక్ పతకాల విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) లో చేరడం లేదని స్పష్టమైంది. గత అక్టోబర్ లో తనను డబ్ల్యూడబ్ల్యూఈ ప్రతినిధులు కలిశారని, దీంతో తాను త్వరలో డబ్ల్యూడబ్ల్యూఈ టోర్నీలో పాల్గొననున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఉపాధ్యక్షుడు కన్యన్ సీమన్, సుశీల్ కుమార్ తో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చలేదు. భారత్ లో గొప్ప పేరు ప్రతిష్ఠలున్న సుశీల్ కు పోటీతత్వం నెలకొన్న అమెరికాలో తగిన గౌరవం లభిస్తుందని కచ్చితంగా చెప్పలేమని కన్యన్ సీమన్ అన్నాడు. అందుకే సుశీల్ తో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చలేదని ఆయన తెలిపాడు.