: ‘పటేల్’లో జగపతి బాబు లుక్ అదిరిపోయింది: దర్శకుడు రాజమౌళి
వారాహి బ్యానర్ పై రూపొందుతున్న‘పటేల్’ చిత్రంలో నటుడు జగపతిబాబు ‘లుక్’ అదిరిపోయిందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో ఏమన్నారంటే.. ‘జగపతిబాబు గారు లుక్స్ వావ్... వారాహి చలన చిత్ర సంస్థ ద్వారా మరో ఉన్నత చిత్రాన్ని రూపొందిస్తోంది...’ అని పేర్కొన్నారు. కాగా, వారాహి సీసీ ద్వారా వాసు పరిమి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిన్న నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు.