: తీర్పును భరించలేక న్యాయమూర్తిపైకి షూ విసిరిన దోషి!
జడ్జిగారు తనకు విధించిన శిక్షను తట్టుకోలేక దోషి ఏకంగా జడ్జిపైకి షూ విసిరిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. దీని వివరాల్లోకి వెళ్తే... కేరళలోని తిరువనంతపురంలో 2014లో 11 ఏళ్ల బాలికపై ఆరుముగన్ (56) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించడంతో, అతనిని దోషిగా నిర్ధారిస్తూ నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తీర్పు విన్న ఆరుముగన్ తీవ్ర ఆగ్రహంతో షూ తీసి, తీర్పు చెప్పే సీట్లో కూర్చున్న జడ్జి మీదకి విసిరేశాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిపై మరో కేసు నమోదు చేశారు.