: బాలీవుడ్‌ నటుడిని ఇంట్లోంచి వెళ్ల‌గొట్టిన‌ భార్య.. వివాహేత‌ర‌ సంబంధ‌మే కార‌ణం


బాలీవుడ్‌లో ఇప్పుడు ఓ వార్త షికారు చేస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు దీపక్ తిజోరి (ఆషికి ఫేం)ని ఆయ‌న భార్య ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టేసింది. త‌న భ‌ర్త మ‌రొక‌రితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే శివాని ఆయ‌న‌ను ఇంట్లోంచి వెళ్లిపొమ్మ‌న్న‌ట్లు స‌మాచారం. దీంతో దీప‌క్ తిజోరి త‌న స్నేహితుల ఇళ్ల‌లో ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా దీప‌క్‌, శివాని పెళ్లి కాకుండానే భార్యాభర్తల్లా కలిసి ఉంటున్నారు. అయితే, శివానికి అంత‌కు ముందే పెళ్లి జ‌రిగింది. తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వలేదని, న్యాయపరంగా చిక్కులు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆమె దీపక్ ను పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది.

అయితే, దీప‌క్‌, శివానికి 21 ఏళ్ల సమారా అనే కుమార్తె ఉంది. తమ పోషణకు దీపక్ డబ్బులు ఇవ్వడం లేదని శివానీ ఇటీవ‌లే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు పెరిగాయి. వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని శివాని సోదరి, గాయకురాలు కనికాలాల్ కూడా చెప్పింది. దీపక్ కు సొంత ఇల్లు ఉందని, ఆయ‌న స్నేహితుల ఇళ్లలో ఉండ‌బోర‌ని ఆమె పేర్కొంది. వారి వ్యవహారం కోర్టులో ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News