: పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రముఖ బౌద్ధ సన్యాసి!


టిబెట్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి థాయే డోర్జే(33) సన్యాసం వదిలేసి భారత్‌లోని తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కార్యాల‌యం ఈ రోజు ప్ర‌క‌ట‌న చేస్తూ, థాయే డోర్జే ఈ నెల 25న ఢిల్లీలో పెళ్లి చేసుకున్నాడ‌ని తెలిపింది.

టిబెట్‌లోని నాలుగు ప్రముఖ బౌద్ధ పాఠశాలల్లో ఒకదాని నాయకుడైన కర్మప లామాకు తాను పునర్జన్మనని చెప్పే డోర్జే... తాను సన్యాసం వదిలేస్తున్నానని ప్రకటించడంతో అంద‌రూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆయ‌న పెళ్లి చేసుకున్న మ‌హిళ రించెన్‌ యాంగ్జోమ్ ( 36) భూటాన్‌లో జన్మించి, ఇండియా, యూర‌ప్‌ల‌లో విద్యాభ్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా డోర్జే మాట్లాడుతూ తాను తీసుకున్న ఈ నిర్ణయం తనపై సానుకూల ప్రభావమే చూపుతుందని అనుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News