: జగన్ జాతకం అద్భుతంగా ఉంది.. 2019లో సీఎం జగనే!: పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి
వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి జాతకం అత్యద్భుతంగా ఉందని పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి తెలిపారు. 2019లో జరిగే ఎన్నికల్లో ఫలితం మొత్తం ఏకపక్షంగానే ఉండబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని... జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని... ఆ క్రెడిట్ కూడా జగన్ కే దక్కుతుందని చెప్పారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలకు జగన్ సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన జగన్... పార్టీ నేతలు, కార్యకర్తలు, తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్ర శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.