: ఫేస్బుక్, వాట్సాప్‌లలో ‘కాటమరాయుడు’.. సైబర్ క్రైం పోలీసులకు నిర్మాత ఫిర్యాదు.. తొలగించాలన్న పోలీసులు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ సినిమాను గుర్తుతెలియని వ్యక్తులు కొందరు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్‌లలో పోస్ట్ చేస్తున్నారంటూ ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్ హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్మాత తరపున నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సాయి రామకృష్ణ పోలీసులను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ‘కాటమరాయుడు’ సినిమాను తొలగించాల్సిందిగా ఫేస్బుక్, వాట్సాప్ సంస్థల ప్రతినిధులను కోరారు. ఫేస్బుక్లో పోస్టింగ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.