: 12వ ఆటగాడు విరాట్ కోహ్లీ: సునీల్ గవాస్కర్


గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ రోజు మైదానంలోకి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌కు ఇచ్చిన విష‌యం తెలిసిందే. కోహ్లీ డ్రింక్స్ బాయ్ అవతారమెత్తడంతో ఆయ‌న‌ అభిమానులతో పాటు కామెంటేటర్లు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఓ వైపు విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూ ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తుండ‌గా, ఇదే అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘భారత ఆటగాళ్ల కోసం ఎవరు మంచి నీళ్లు తీసుకుని వచ్చారో చూడండి.. 12వ ఆటగాడు విరాట్ కోహ్లీ’ అని కామెంట్ చేశారు. అలాగే మాజీ క్రికెటర్, కామెంటేటర్ బ్రెట్ లీ కూడా ఈ సంద‌ర్భంగా స్పందిస్తూ.. ప్ర‌పంచంలో కోహ్లీ చాలా ఖరీదైన డ్రింక్స్ బాయ్ అని అన్నాడు.

  • Loading...

More Telugu News