: బీఎస్ఎన్ఎల్ ‘వన్ జీబీ డేటా ఫ్రీ’ ఆఫర్!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ మరో ఫ్రీ ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ జీఎస్ఎమ్ డేటా సర్వీసులు వినియోగించని కస్టమర్లకు ఒక జీబీ డేటాను ఒకసారి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల డిజిటల్ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ వన్ జీబీ డేటాను ఫ్రీగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. తమ ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లలో ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్యను పెంచాలని ఆ సంస్థ యోచిస్తోంది.