: అమెరికాలో మరో దారుణం... హత్యకు గురైన ప్రకాశం జిల్లా వాసులు


అమెరికాలో మరో దారుణం జరిగింది. ఇద్దరు తెలుగువారు దారుణ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెం ప్రాంతానికి చెందిన నర్రా హనుమంతరావు, యూఎస్ లోని బర్లింగ్టన్ లో నివాసం ఉంటున్నారు. ఆయన ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఆయన భార్య, కుమారుడు హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు ఏమిటన్న విషయం ఇంకా తెలియరాలేదు. జాతివివక్ష నేపథ్యంలో హత్యలు జరిగాయా? అన్న కోణంలోనూ కేసును విచారించనున్నట్టు ఫెడరల్ పోలీసు వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News