: నయనతార సినిమాకు 'ఏ' సర్టిఫికెట్.. షాకైన సినిమా యూనిట్
హీరోయిన్ ఓరియెంటెడ్ హర్రర్ నేపథ్యంలో వస్తున్న 'డోరా' సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లు బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే, సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో, ప్రేక్షకుల ఆసక్తి కొంచెం తారుమారైందని చెబుతున్నారు. 'ఏ' సర్టిఫికెట్ వచ్చిన సినిమాను థియేటర్ కు వెళ్లి చూడ్డానికి చాలా మంది ఆసక్తి చూపించకపోవడమే దీనికి కారణం. అయితే, ఈ సినిమాలో హర్రర్ కంటెంట్ అధికంగా ఉన్నందువల్లే సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ, సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ తో సినిమా యూనిట్ షాక్ కు గురైంది. ఈ నేపథ్యంలో 'యు/ఏ' సర్టిఫికెట్ కోసం రివైజింగ్ కమిటీకి వెళ్లాలని యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం.