: ఈ హౌస్ లో ఎవరైనా ఒకరే ఉండాలి... తేలుద్దామా?: చంద్రబాబు నిప్పులు


విపక్ష నేత వైఎస్ జగన్ కోరినట్టుగా అగ్రీగోల్డ్ లావాదేవీలు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తుల విషయమై జ్యుడీషియల్ విచారణ జరిపించేందుకు సిద్ధమని, ఒకవేళ విచారణ తరువాత ప్రత్తిపాటి పుల్లారావు తప్పుందని తేలితే, ఆయన్ను సభ నుంచి వెలేస్తానని, ఆరోపణల్లో నిజం లేదని రుజువైతే, జగన్ ఇక జీవితంలో సభకు రాకూడదని, ధైర్యముంటే తన సవాల్ ను అంగీకరించాలని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో డిమాండ్ చేశారు. "ఈ హౌస్ లో ఎవరైనా ఒకరే ఉండాలి, ఉంటే ప్రత్తిపాటి, లేదంటే జగన్ ఉండాలి. విచారణ వేసి తేలుద్దామా? నా మాటలకు జగన్ అంగీకరించే పక్షంలో జ్యుడీషియల్ విచారణకు ఈ క్షణమే ఆదేశిస్తున్నా" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News