: అందుకే బిర్యానీ తినడం మానేశా: పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్


పాకిస్థాన్ బ్యాట్స్ మన్, పార్ట్ టైమ్ స్పిన్నర్ ఉమర్ అక్మల్ ఫిట్ నెస్ లేమి కారణంగా వెస్టిండీస్ పర్యటించే జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. దీంతో ఫిట్ నెస్ లోపంపై స్పందించాడు. తనది, తన సోదరుడు కమ్రాన్ అక్మల్ ది శరీరతత్వాలు కాస్త భిన్నమైనవని అన్నాడు. కనీసం నీరు తాగినా బరువు పెరిగిపోతామని అన్నాడు. దీనికి జన్యులోపం కారణమని తెలిపాడు. అందుకే తాను బిర్యానీ, రోటీలను త్యాగం చేశానని చెప్పాడు. ఫిట్ నెస్ సాధించేందుకు కేవలం సలాడ్స్ మాత్రమే తింటున్నానని చెప్పాడు. కాగా, వెస్టిండీస్ లో పర్యటించనున్న పాకిస్థాన్ జట్టులో ఉమర్ అక్మల్ కు మొండి చెయ్యి ఎదురుకాగా, కమ్రాన్ అక్మల్ జట్టులోకి ఎంపికయ్యాడు. 

  • Loading...

More Telugu News