: అమెరికాకు వెళ్లే విమానాల్లో ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్లపై నిషేధం!


కొన్ని దేశాల నుంచి వచ్చే విమానాల్లో ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. జోర్డాన్‌కు చెందిన రాయల్‌ జోర్డానియన్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారులు ఇదే అంశంపై ట్వీట్ చేస్తూ అమెరికా వైమానిక శాఖ అధికారుల సూచనల మేరకు తమ సంస్థ నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో ఆయా వస్తువులను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, మొబైల్‌, మెడికల్‌ పరికరాలకు మాత్రం ఈ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌బోవ‌ని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఆ ట్వీట్‌ను ట్విట్ట‌ర్ నుంచి తొలగించారు. మ‌రోవైపు భద్రతాపరమైన నిర్ణయాలపై తాము ఇప్పుడే ఎలాంటి ప్రకటనలు చేయలేమని హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. అవసరమైనప్పుడు తామే తెలుపుతామ‌ని పేర్కొంది. ఈ అంశంపై అమెరికా నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News