: చంద్రబాబు మాటలన్నీ గ్యాస్‌తో నిండినవిగా ఉన్నాయి: అసెంబ్లీలో జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సభలో అన్నీ అసత్యాలే చెప్పారని అన్నారు. చంద్రబాబు నిజాలు చెప్పి ఉంటే సంతోషించేవాళ్లమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలన్నీ గ్యాస్‌తో నిండినవిగా ఉన్నాయని అన్నారు. తాము సభలో తప్పుడు లెక్కలు చూపుతూ విమర్శలు చేస్తున్నామని టీడీపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాము చెబుతున్నవి తమ సొంత లెక్కలు కావని, పలు సర్వేల్లో వెల్లడైన వివరాలే చెబుతున్నామని అన్నారు. అవినీతిలో ఏపీ నెంబర్1 అని పలు సంస్థలు చెప్పాయని జగన్ అన్నారు. వాస్తవాలు ఒకలా ఉంటే, చంద్రబాబు మరోలా చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు.