: అరాచకాలకు పాల్పడినా... గెలవలేకపోయింది: మంత్రి నారాయణ
నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి లేకపోయినా వైసీపీ పోటీ చేసిందని... ఎన్నికల్లో గెలవడానికి అనేక అరాచకాలకు పాల్పడిందని మంత్రి నారాయణ అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రలోభపెట్టేందుకు వైసీపీ నేతలు ఎంతగానో ప్రయత్నించారని... అయినా, విజయవంతం కాలేకపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డి 84 ఓట్లతో విజయం సాధించారని చెప్పారు. ఈ విజయానికి కారకులైన స్థానిక ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలకు ధన్యవాదాలు చెబుతున్నామని తెలిపారు.