: కష్టాల్లో పడుతోన్న ఆస్ట్రేలియా... మరో రెండు వికెట్లు డౌన్


రాంచీలో జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజున, భారత బౌలర్ జడేజా సత్తా చాటడం, మరో బౌలర్ ఇషాంత్ శర్మ కీలమైన రెన్షా వికెట్ తీయడంతో ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోర్ 23/2తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు రెన్షా, స్మిత్ లు తొలి గంట ఆచితూచి ఆడారు. మ్యాచ్ డ్రా దిశగా సాగే సూచనలు కనిపిస్తున్న వేళ, ప్రమాదకర స్మిత్ ను జడేజా, రెన్షాను ఇషాంత్ పెవిలియన్ దారి పట్టించారు. స్మిత్ 21, రెన్షా 15 పరుగులకు అవుట్ కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 31 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు క్రీజులో నిలిస్తే, మ్యాచ్ డ్రాగా ముగియవచ్చు. ఇండియా మరో ఆరు వికెట్లను ఫటఫటా తీయగలిగితే, విజయం ఇండియాను వరించే అవకాశం వుంది

  • Loading...

More Telugu News