: ఏకంగా 6 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న కాగ్నిజంట్


ఆటోమేషన్ విధానానికి మారిపోతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే వేల మంది ఉద్యోగులను తొలగించగా, తాజాగా ఆ జాబితాలో యూఎస్ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా చేరిపోయింది. సంస్థలో మొత్తం 6 వేల మందిని విధుల నుంచి తొలగించాలని కాగ్నిజెంట్ యాజమాన్యం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 2.3 శాతం మందిని సంస్థ తొలగించనుంది. డిజిటల్ సేవల విభాగంలోకి మరలే క్రమం, ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న సంక్షోభం కారణాలుగా ఉద్యోగులను తొలగించాలని సంస్థలు భావిస్తున్నాయి.

ఉద్యోగులు తమంతట తాముగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మారకుంటే, సంస్థలో కొనసాగడం కష్టమని తాము ఇప్పటికే ఉద్యోగులకు స్పష్టం చేసినట్టు కాగ్నిజెంట్ వర్గాలు వెల్లడించాయి. కాగా, కాగ్నిజెంట్ కు ప్రపంచవ్యాప్తంగా 2.65 లక్షల మంది ఉద్యోగులుండగా, ఒక్క ఇండియాలోనే 1.88 లక్షల మంది ఉన్నారు. గత సంవత్సరంలో సుమారు 2 శాతం మందిని సంస్థ తొలగించింది. ఇక ఈ సంవత్సరం ఎంతమందిని తొలగిస్తారన్న విషయమై అధికారిక ప్రకటన లేకుండా సుమారు 6 వేల మందికి పింక్ స్లిప్ లు ఇవ్వడం ఖాయమని సమాచారం.

  • Loading...

More Telugu News