: నెల్లూరు కోటలో టీడీపీ జయకేతనం... వాకాటి గెలుపు


నెల్లూరు స్థానిక సంస్థల అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డ వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై 87 ఓట్ల మెజారిటీతో వాకాటి గెలుపొందారు. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ముగియగా అధికారులు వాకాటి విజయాన్ని ధ్రువీకరించారు. కౌంటింగ్ ప్రారంభమైన 50 నిమిషాల్లోనే ఫలితాలు వెలువడటం గమనార్హం. కాగా, వాస్తవానికి నెల్లూరు పరిధిలో వైకాపాకు ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన పరిణామాల్లో భాగంగా, పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించడంతో టీడీపీ విజయం సునాయాసమైంది.

  • Loading...

More Telugu News