: ద్విశతకం సాధించిన పుజారా.. సెంచరీ చేసిన సాహా అవుట్


రాంచీ వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో పుజారా ద్విశతకం సాధించాడు. దీంతో టెస్టుల్లో పుజారా మూడో ద్విశతకం సాధించినట్లయింది. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాట్స్ మెన్ గా కూడా రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ ఘనత రాహుల్ ద్రావిడ్ పేరిట ఉంది. 2004లో రావల్సిండిలో జరిగిన టెస్టులో 495 బంతులు ఎదుర్కొన్న రాహుల్ ద్రావిడ్ 270 పరుగులు చేశాడు. ఆ రికార్డును పుజారా అధిగమించడం విశేషం. మూడో టెస్టు నాలుగో రోజు ఆటలో 524 బంతులు ఎదుర్కొన్న పుజారా 202 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత సాహా (111) మాక్స్ వెల్ బౌలింగ్ లో పెవిలియన్ ముఖం పట్టాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ క్రీజ్ లో ఉన్నారు. స్కోరు విషయానికొస్తే ..198 ఓవర్లలో టీమిండియా 550 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది.

  • Loading...

More Telugu News