: షాకింగ్.... ఐఏఎస్ అధికారిణి మెడలో గొలుసు కొట్టేశారు!
చైన్ స్నాచింగ్ లు దేశంలో ఏ స్థాయికి చేరుకున్నాయో తెలిపే షాకింగ్ సంఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ లో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే.... అజ్మీర్ లోని ఆయుర్వేద్ డిపార్ట్ మెంట్ లో అదనపు డైరెక్టర్ గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్నేహలత పన్వార్ నేటి ఉదయం మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటున్న సమయంలో వెనుక నుంచి వేగంగా బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్స్ ఆమె మెడలోని గొలుసు తెంపుకుని వెళ్లిపోయారు. దీంతో ఆమె షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దుస్సాహసానికి పాల్పడ్డ చైన్ స్నాచర్ల కోసం గాలింపు ప్రారంభించారు.