: క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. అభిమానుల్లో జోష్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. అయితే, రెండోరోజు ఆటలో కోహ్లీ కనపడకపోవడం, ఆయన స్థానంలో రహానె కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించడంతో నిరాశకు గురైన కోహ్లీ అభిమానులు ఈ రోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కొనసాగుతున్న ఆటలో ఒకెఫ్ బౌలింగ్లో మురళీ విజయ్ అవుటయిన అనంతరం విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా 44, కోహ్లీ 1 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 198గా ఉంది.