: నేర చరిత్ర లేకుంటేనే బ్రిటన్ వీసా.. పూర్తిగా పరిశీలించాకే జారీ
ఇక బ్రిటన్ వెళ్లాలంటే నేర చరిత్ర లేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు నిబంధనలను అమల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. టైర్-2 వీసాకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఉపాధ్యాయులు, నర్సులు, సామాజిక కార్యకర్తలు తమకు ఎటువంటి నేర చరిత్ర లేదని నిర్ధారించే పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుంది. చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దలకు సేవ చేసేందుకు బ్రిటన్ వచ్చే వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. నాన్ ఈయూ దేశాలకు వర్తించే ఈ నిబంధనను ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకు రావాలని భావిస్తున్న యూకే త్వరలో ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదానికి పంపనుంది.