: ధర్మవరంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి.. 11 మందికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. తాజాగా పట్టణంలోని గూడ్స్ షెడ్ కొట్టాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకటో వార్డులో ఆధిపత్యం కోసం చెలరేగిన ఈ ఘర్షణలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.