: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్మిత్... నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా!


ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. జార్ఖండ్ లోని రాంచీ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ తొలిరోజున ఆటలో ఆసీస్ రాణిస్తోంది. ఓపెనర్లు వార్నర్ (19) రెన్ షా (44) శుభారంభం ఇచ్చారు. మార్ష్ (2) విఫలం కాగా, హ్యాండ్స్ కొంబో (19) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఉమేష్ యాదవ్ బోల్తా కొట్టించడంతో పెవిలియన్ చేరాడు.

వార్నర్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (92) నిలదొక్కుకున్నాడు. ఒక ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్నా క్రీజులో గోడలా నిలబడిపోయాడు. మ్యాచ్ వెల్ (35) తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. జాగ్రత్తగా ఆడుతూనే సమర్థవంతంగా టీమిండియా బౌలర్లను ఎదుర్కొన్నాడు. చెత్తబంతులను బౌండరీ దాటిస్తూ సెంచరీకి చేరువయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 70 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, అశ్విన్, జడేజా చెరొక వికెట్ తీశారు. 

  • Loading...

More Telugu News