: హైదరాబాదులో త్వరలోనే అన్నపూర్ణ భోజన కేంద్రాలు
హైదరాబాదులోని జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే అన్నపూర్ణ భోజన కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. టీఎస్ శాసనసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 109 కేంద్రాల్లో కేవలం 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని... త్వరలోనే వీటిని 150 కేంద్రాలకు పెంచుతామని ఆయన చెప్పారు. ఈ కేంద్రాలకు అన్నపూర్ణ భోజన కేంద్రాలుగా పేరు పెడతామని తెలిపారు. 5 రూపాయల భోజనం చాలా నాణ్యంగా ఉందంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డి సహా పలువురు నేతలు ఇప్పటికే కితాబిచ్చారని కేటీఆర్ చెప్పారు. ఆసుపత్రులు, లేబర్ అడ్డాలలో ఈ కేంద్రాలను శాశ్వతంగా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భోజన కేంద్రాల వద్ద మంచి నీటి సదుపాయాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు.