: ఏపీ బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి కేటాయింపులు


అమరావతిలోని నూతన అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ ను ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి ఇస్తామంటూ చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దిశగా ఇంతవరకు ప్రభుత్వం అడుగులు వేయలేదు. తొలిసారిగా ఈ బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని చేర్చింది. ఈ కార్యక్రమం కోసం బడ్జెట్ లో తొలిసారిగా రూ. 500 కోట్లను కేటాయించారు. అయితే, ఈ భృతిని చెల్లించే విధానానికి సంబంధించిన విధివిధానాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News