: కేరళకు వెళుతున్న ఉక్కుమహిళ.. శాశ్వతంగా అక్కడే ఉండిపోయే అవకాశం!


ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇరోం షర్మిల మణిపూర్ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె నెల రోజుల పాటు కేరళకు వెళుతున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే అట్టాప్పాడి ప్రాంతంలో ఆమె గడపనున్నారు. మహాదాత ఉమా ప్రేమన్ నడుపుతున్న శాంతి ఆశ్రమంలో ఆమె ఉండబోతున్నారు. అయితే, నెల రోజులు తర్వాత ఆమె తిరిగి మణిపూర్ కు వస్తారా అనే విషయంలో క్లారిటీ లేదు. ఆమె అక్కడే శాశ్వతంగా ఉండిపోయే అవకాశాలను కొట్టిపారేయలేమని కొందరు చెబుతున్నారు. ఈ రోజు ఇరోం షర్మిల 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News