: భూమా మరణానికి జగనే కారణం... ఆయన వల్ల పట్టుకున్న తలనొప్పి నాకింకా తగ్గలేదు: జలీల్ ఖాన్
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణానికి వైఎస్ జగన్ వైఖరే కారణమని తెలుగుదేశం పార్టీ నేత జలీల్ ఖాన్ ఆరోపించారు. వైకాపాలో ఉన్నప్పుడు జగన్ పెట్టిన టార్చర్ తోనే భూమా తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, ఆయన తన బాధను చెప్పుకుని బాధపడేవారని అన్నారు. తాను కూడా వైకాపాను వీడి వచ్చానని గుర్తు చేస్తూ, నాడు జగన్ వైఖరి కారణంగా మొదలైన తలనొప్పి తనకింకా తగ్గలేదని అన్నారు. ఓ పెద్ద నేత మరణంపై అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన వేళ, పక్క గదిలో ఉన్న విపక్ష నేత హాజరు కాకపోవడం అత్యంత హేయమని నిప్పులు చెరిగారు. జగన్ వైఖరితో ఏర్పడిన మానసిక ఆందోళనే భూమాను బలిగొందని, ఆ ఆందోళనే వైకాపా ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోకి చేరేలా చేసిందని అన్నారు. జగన్ మనిషి రూపంలో ఉన్న సైతాన్ అని విమర్శించారు.