: ఉదయగిరి కొండపై గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్ట్
నెల్లూరు జిల్లా ఉదయగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఓ ముఠా చాలా కాలంగా తవ్వకాలు జరుపుతోంది. ఉదయగిరి కొండపై ఉన్న పురాతన స్థావరాలపై విచ్చలవిడిగా ఈ ముఠా సభ్యులు తవ్వకాలు సాగిస్తున్నారు. కొంత మంది స్థానికులు, మరికొంత మంది స్థానికేతరులు ఓ ముఠాగా ఏర్పడి తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆత్మకూరు ప్రాంతంలోని అనంతసాగరం చెరువులో గుప్తనిధుల కోసం తవ్వుతూ పోలీసులకు పట్టుబడ్డ వారిలో ఉదయగిరి వాసులు కూడా ఉన్నారు.