: హోలీ వేడుకల్లో సందడి చేసిన బ్రెట్ లీ, మాథ్యూ హేడెన్, యువీ, భజ్జీ, రహానే


దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆసీస్ వెటరన్ లు, టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్, వెటరన్ బ్రెట్ లీ, మాజీ ఓపెనర్ మాధ్యూ హేడెన్ లు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ భారతీయులు రంగులు రాశారు. బ్రెట్ లీ చేతినిండా రంగులు తీసుకుని హేడెన్ పై చల్లాడు. హేడెన్ కూడా బ్రెట్ లీని రంగుల్లో ముంచెత్తాడు. రంగుల్లో తడిసి ముద్దైన బ్రెట్ లీ హోలీ వేడుకలను తన మెబైల్ ఫోన్ తో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టగా, దానికి విశేషమైన ఆదరణ లభించింది. లక్షల మంది ఆ వీడియోను వీక్షించడం విశేషం. టీమిండియా క్రికెటర్లలో హర్భజన్ సింగ్ తన భార్య గీతా బాస్రాతో వేడుకలు జరుపుకోగా, యువరాజ్ సింగ్ నిండా రంగుల్లో తడిసి అభిమానుల కోసం పాటపాడాడు. సచిన్, సెహ్వాగ్, అజింక్యా రహానే తదితరులు హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుని, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News