: జయలలిత వల్ల ఎన్నో కష్టాలు పడ్డా... ప్రభుత్వాన్ని చికాకు పెడుతూనే ఉంటా: కమలహాసన్


జయలలిత వల్ల తాను ఎన్నో కష్టాలు పడ్డానని, 2013లో  తాను నిర్మించిన ‘విశ్వరూపం’ చిత్రం విడుదలకు ఆమె ఎన్నో ఆటంకాలు కల్పించిందని ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏర్పాటు అయిందని, ప్రభుత్వంలో ఉన్నవారిని తాను చికాకు పెడుతూనే ఉంటానని ఆయన హెచ్చరించారు.

తమిళనాడులో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా వారిని ప్రశ్నిస్తానని కమల్ అన్నారు. నాడు తన సినిమా ‘విశ్వరూపం’ కోసం తన సర్వస్వాన్ని పెట్టి నిర్మించానని, ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఈ సినిమా ఉందంటూ నాడు అన్నాడీఎంకే ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాపై నిషేధం ఎత్తివేయకపోతే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతానని నాడు కమల్ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News