: అవన్నీ రూమర్లే.. నేను చెప్పిందే నమ్మండి: సల్మాన్ ఖాన్
ఎవరో చెప్పే విషయాలను నమ్మకూడదని... కేవలం తనను మాత్రమే ఫాలో కావాలని... తాను చెప్పిందే నమ్మాలని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అన్నాడు. అసలు విషయం ఏమిటంటే... బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా సల్మాన్ ఖాన్ ఓ సినిమా నిర్మిస్తున్నాడు. దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ సినీ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు రాబోతోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో సల్లూభాయ్ ఉన్నాడు.
ఈ నేపథ్యంలో, ఈ సినిమా అటకెక్కిందనే వార్తలు వచ్చాయి. ఈ పుకార్లపై సల్మాన్ ఖాన్ స్పందించాడు. అక్షయ్ తో సినిమాను నిర్మించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు. వదంతులను నమ్మవద్దని... తనను మాత్రమే ఫాలో కావాలని సూచించాడు.