: హైద‌రాబాద్‌లో నిర్మాణంలో ఉన్న సెల్లార్లో కూలిన మట్టిపెళ్లలు.. ఇద్ద‌రు మహిళా కూలీల మృతి


హైద‌రాబాద్ శివారులోని మాదాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని కొత్త చౌర‌స్తావ‌ద్ద‌ నిర్మాణంలో ఉన్న ఓ సెల్లార్ కోసం తవ్వకం జరుపుతుండగా మట్టిపెళ్లలు ఒక్క‌సారిగా కుప్ప‌కూలి పడడంతో ఇద్ద‌రు మహిళా కూలీలు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. సెల్లార్‌లో మ‌రికొంద‌రు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. ఇటీవ‌లే మాదాపూర్‌కి ద‌గ్గ‌ర‌లోని నాన‌క్‌రాంగూడ‌లో.. అనంత‌రం ఉప్ప‌ల్‌లో నిర్మాణంలో ఉన్న బ‌హుళ అంత‌స్తుల భ‌వనాలు కూలి పలువురు కూలీలు మృతి చెందిన ఘ‌ట‌న‌లు మ‌ర‌వక‌‌ముందే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంపై మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News