భూమాను కోల్పోవడం ఏపీ రాజకీయాలకు పెద్ద లోటు: ఎంపీ చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భూమాను కోల్పోవడం ఏపీ రాజకీయాలకు పెద్ద లోటు: ఎంపీ చిరంజీవి

టీడీపీ నేత భూమా నాగిరెడ్డి మృతి చెందడం, ఏపీ రాజకీయాలకు పెద్దలోటు అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. భూమా మృతి పట్ల తన సానుభూతిని వ్యక్తం చేశారు. భూమా ఆత్మకు శాంతి చేకూరాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, టీడీపీ మాజీ ఎంపీ, మరో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ, తనకు స్నేహితుడు, సన్నిహితుడు అయిన భూమాను కోల్పోవడం తనను కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. 

More Telugu News