Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కనీసం ట్రైలర్ కూడా విడుదల కాలేదు.. అప్పుడే రూ.100 కోట్లు రాబట్టిన షారుక్ సినిమా

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ద రింగ్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. క‌నీసం ఈ సినిమా ట్రైల‌ర్ కూడా రాక‌ముందే ఈ సినిమా రూ.100 కోట్లు రాబట్టింది. తాజాగా ఎన్‌హెచ్‌ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమా భారత్ స‌హా ఓవర్‌సీస్‌లోనూ సోలో డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. ఈ రైట్స్‌ కిందే షారుక్‌ సినిమాకి వంద కోట్లకు పైగా వచ్చినట్లు స‌మాచారం. ఈ సినిమాలో షారుక్ స‌ర‌న‌స అనుష్క‌శ‌ర్మ న‌టిస్తోంది. ఈ సినిమాకు ఇంతియాజ్‌ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

More Telugu News