: రాంచీ పిచ్ ను పరిశీలించిన ధోనీ... మైదానంలో సందడి
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాంచీ మైదానాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ మైదానం తన సొంత మైదానం కావడంతో అధికారులు ధోనిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాంచీ పిచ్ ను పరిశీలించి క్యూరేటర్ ఎస్బీ సింగ్ తో కాసేపు ముచ్చటించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల్లో భాగంగా ఈనెల 16 నుంచి భారత్ రాంచీలో మూడో టెస్ట్ ఆడనుంది. ఈ సందర్భంగా ధోనీ రాంచీ పిచ్ ను పరిశీలించడం హాట్ టాపిక్ గా మారింది.