: ఏపీలో 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు రేపే పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ రేపు జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ, రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలలోకి చరవాణులు, కెమెరాలకు అనుమతి లేదని అన్నారు. ఓటర్ల ప్రాధాన్యత క్రమంలో అంకెల రూపంలో ఓటు వేయాలని చెప్పారు. ప్రస్తుత ఓటరు జాబితాలోని వారు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులని అన్నారు. రాష్ట్రంలో పట్టభద్ర ఓటర్లు 6,23,931 మంది ఉన్నారని, వారి కోసం 846 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఉపాధ్యాయ ఓటర్లు 40,772 మంది ఉన్నారని వారి కోసం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.