: చంద్రబాబును నేనేమీ అనలేదు: డిప్యూటీ సీఎం కేఈ
తాను చంద్రబాబుపై అసహనాన్ని వ్యక్తం చేసినట్టు వచ్చిన వార్తలపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు. తమ పార్టీ అధినేతను తానేమీ అనలేదని కర్నూలులో మీడియాకు వివరించారు. చంద్రబాబంటే తనతో పాటు బడుగులందరికీ ఎంతో అభిమానమని తెలిపారు. బీసీనైన తనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఆయన గౌరవించారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబును తానేదో అన్నట్టుగా మీడియాలో వచ్చిన వార్తలతో కలత చెందానని చెప్పారు. చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా తీసుకోవాలని, ఒకవేళ పదవి ఇవ్వకున్నా ఏమీ ఫర్వాలేదని తన సోదరుడు కేఈ ప్రభాకర్ కు తాను చెప్పానని అన్నారు.