: నా బుర్ర పనిచేయలేదు... నేనలా చేసుండాల్సింది కాదు: స్మిత్


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అవుటైన సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వివాదానికి కేంద్రబిందువుగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్మిత్ స్పందించాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని చెప్పాడు. కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా అలా వ్యవహరించకూడదని పేర్కొన్నాడు. ఆ సమయంలో తన బుర్ర పనిచేయలేదని చెప్పాడు. అందుకే అలాంటి తప్పు జరిగిందని తెలిపాడు. అయితే అది కావాలని చేసిన తప్పు కాదని పేర్కొన్నాడు.

కాగా, ఉమేష్ యాదవ్ సంధించిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అంపైర్ నిర్ణయం ప్రకటించిన తరువాత రివ్యూ కోరకుండా క్రీజులోనే ఉన్నాడు. తీరిగ్గా నాన్ స్ట్రైకర్ ఎండ్ కు వెళ్లి అక్కడున్న కోంబ్ ను సలహా కోరాడు. ఆ తరువాత డ్రెస్సింగ్ రూం వైపు చూశాడు. ఈ లోపు అంపైర్ స్మిత్ ను గమనించడం, కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్మిత్ మైదానం వీడాడు. దీంతో వివాదం రేగింది. క్రీడాస్పూర్తి ఏదంటూ పలువురు ప్రశ్నించారు. దీంతో స్మిత్ వివరణ ఇచ్చాడు. 

  • Loading...

More Telugu News